Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకలిగా అనిపించినప్పుడు ఇలా చేస్తే..?

Advertiesment
ఆకలిగా అనిపించినప్పుడు ఇలా చేస్తే..?
, శనివారం, 12 జనవరి 2019 (11:42 IST)
సమయానికి తినకపోతే.. బరువు పెరగడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలానే మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే.. ఒక వయస్సు దాటిన తరువాత ఓవర్ వెయిట్‌ వస్తుందన్నది వారి మాట. ఒబిసిటీతో పాటు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే.. నిర్ణీత వేళకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిది. 
 
ఈ క్రమంలో ప్రతి రోజూ ఉదయాన్ని బలవర్థకమైన అల్పాహారాన్ని మితంగా కాకుండా కాస్త ఎక్కువగానే తీసుకోవాటున్నారు న్యూట్రీషియన్లు. ఇలా చేయడం వలన మీ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మీ ఎనర్జీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచడానికి దోహదపడుతుంది. అలానే, ప్రతి రోజూ మీరు తీసుకునే ఆహారాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుని, అందులో సగం తాజా కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు. ఇక మిగిలిన సగంలో ఒక పావు పప్పు దినుసులు, మరో పావువంతు మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి. 
 
కొన్నిసార్లు దాహంగా ఉన్నా కూడా ఆకలిగా ఉన్నామనుకుని తెగ తినేస్తాం. అందుకే మీరెప్పుడు ఆకలిగా అనిపించినా ముందు ఓ గ్లాస్ వాటర్ తాగాలి. దీని తర్వాత భోజనం చేస్తే తక్కువగా తినే అవకాశం ఉంది. మరికొన్ని సమయాల్లో ఒక పూట ఆహారం తీసుకోక పోయినా.. బాగా ఆకలేస్తుంది. అలాంటపుడు ఆకలేస్తుంది కదా అని గబగబా తినేస్తాం. దీని వల్ల ఎంత తింటున్నామనేది తెలియదు. నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. 
 
అలానే, రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల మంచినీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ టైమ్‌లో స్నాక్స్ తప్పనిసరి తీసుకోవాలి. తక్కువ కేలరీస్ ఉన్న బాదామ్ లాంటివి తీసుకుంటే మరీ మంచిది. 
 
ముఖ్యంగా ఇంట్లో కాకుండా బయట ఆహారం తీసుకుంటే.. ముందు ఫ్రూట్ సలాడ్ కానీ, ఏదైనా సూప్‌గానీ తీసుకోవాలి. ఆ తర్వాతే భోజనం చేయాలి. దీనివలన హై క్యాలరీలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఉంటారు. భోజనం తర్వాత ఐస్‌క్రీమ్, కేక్ లేదా పాయసం వంటివి దూరంగా ఉంచితే మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మజ్జిగలో వండిన అన్నం తింటే..?