యూరిన్‌కు వెళ్ళకుండా బిగపట్టుకుంటే చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పనుల్లో పడి కొందరు.. పరిశుభ్రత లేని బాత్రూమ్‌లను వాడకూడదని తలచి కొందరు యూరిన్‌కు వెళ్ళకుండా బిగపట్టుకుంటారు. అలాంటి వారు మీరైతే ఇన్ఫెక్షన్లు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అవాంఛిత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే.. యూరిన్‌కి వెళ్లాలనే సంకేతం వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. వెళ్లకుండా అలాగే బిగపట్టుకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తప్పవు. యూరిన్‌లో క్రిములు ఎక్కువగా ఉంటాయి.
అవి మూత్రాశయంలో ఎక్కువ సేపు వుంటే.. ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కాబట్టి యూరిన్ సంకేతం వచ్చిన వెంటనే వెళ్లాలి. ఎక్కువసేపు యూరిన్‌కి వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటే కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడతాయి. చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కానీ యూరిన్‌కి వెళ్లకుండా ఆపుకుంటే రాళ్లు పెద్దగా అవుతాయి.
కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడకుండా ఉండాలంటే ఎక్కువ మోతాదులో నీళ్లు తాగాలి. శరీరం సూచించినప్పుడు యూరిన్‌కు వెళ్లాలి. దీనివల్ల కిడ్నీల్లో ఉన్న ఎలాంటి వ్యర్థాలనైనా తొలగించుకోవచ్చు. యూరిన్ ఆపుకుంటే బ్లాడర్‌కే దెబ్బేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.