Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉల్లికాడలు తీసుకుంటే..?

Advertiesment
ఉల్లికాడలు తీసుకుంటే..?
, శనివారం, 29 డిశెంబరు 2018 (10:25 IST)
ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్‌ని మెరుగుపరుస్తుంది. ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
 
అసౌకర్య అరుగుదల నుండి ఉపశమనానికి యాంటి బాక్టీరియల్ లక్షణాలను కూడా అందిస్తుంది. ఈ కూరగాయలోని విటమిన్ C వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లికాడలలో పెక్టిన్ (నీటిలో కరిగే కొల్లాయిడల్ కార్బోహైడ్రేట్) ముఖ్యంగా పెద్దప్రేగు కాన్సర్ అభివృద్ది అవకాశాలను తగ్గిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు మంచి కూరగాయ.
 
ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అల్లిల్ ప్రోపిల్ డిసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది. దీనిలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది.
 

స్ధూలపోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారం. ఉల్లికాడలు కళ్ళ జబ్బులకు, కాళ్ళ సమస్యలకు మంచివి. కూరగాయలలోని అల్లసిన్ చర్మానికి మంచిది. ఇది చర్మం ముడతల నుండి రక్షిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెండకాయలోని ఆరోగ్య రహస్యాలు...