మధుమేహులకు మేలే చేసే గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలు బరువు పెరగకుండా చేస్తాయి. కండరాల ఆరోగ్యాన్ని కాపాడే గుమ్మడి గింజలు కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజల్లో విటమిన్ బి-15 పుష్కలంగా వుంటుంది. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపా
గుమ్మడి గింజలు బరువు పెరగకుండా చేస్తాయి. కండరాల ఆరోగ్యాన్ని కాపాడే గుమ్మడి గింజలు కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజల్లో విటమిన్ బి-15 పుష్కలంగా వుంటుంది. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజలను తినడం ద్వారా కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుమ్మడి గింజలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆర్థరైటిస్ ముప్పును తగ్గిస్తాయి.
డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
కిడ్నీ సమస్యలతో బాధపడే వారు, వారంలో కనీసం రెండు మూడు సార్లు గుమ్మడి గింజలను తీసుకోవడం చాలా ఉత్తమం. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను సహజంగానే కరిగించడానికి సహాయపడుతుంది.
గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించగలిగే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.