Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేరేడు పండ్లు తింటే.. ఇక డయాబెటిస్ దరిదాపుల్లోకైనా రాదట..

నేరేడు పండ్లు తింటే.. ఇక డయాబెటిస్ దరిదాపుల్లోకైనా రాదట..
, మంగళవారం, 2 జులై 2019 (14:25 IST)
సమ్మర్‌లో ఎక్కువగా లభించే ఫ్రూట్స్‌లో నేరేడు ఒకటి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ పండ్లను ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్‌, ప్రక్టోజ్‌లు ముఖ్యమైనవి. నేరేడుని జామ్‌లు, వెనిగర్‌, సాండీస్‌, ఆల్కహాల్‌ తక్కువశాతం ఉండే వైన్‌ల తయారీలో వాడుతుంటారు. 
 
నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచడమే కాక, సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. 
 
గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకుని నీటిలో కలుపుకుని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. నేరేడు పండ్లలో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది . 100 గ్రాముల పండ్లలో 55 మి.గ్రాల పొటాషియం ఉంటుంది. యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురురంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమోటా వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 
నేరేడు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. నేరేడు పళ్లను తీసుకునే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
 
వేసవిలో వేడి వాతావరణం వల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. నేరేడు పండ్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు విటమిన్ సి శరీరంలో ఎముకలు బలంగా ఉండేదుకు సహాయపడుతుంది. నేరేడులో విటమిన్‌-ఎ, సి వంటి పోషకాలుంటాయి. ఇవి కళ్లు, చర్మం ఆరోగ్యానికి మంచివి. సహజసిద్ధంగా బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేసే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరగడపున మెంతుల చూర్ణం నీళ్ళతో కలిపి తీసుకుంటే...?