Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలసట మటాష్.. జ్ఞాపకశక్తిని పెంచే.. ఉసిరికాయ..!

ఉసిరికాయలో ఎన్నో ఆరోగ్య విలువలు, ఔషధ లక్షణాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. పుల్ల పుల్లగా వగురుగా ఉండే ఈ ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌‌తో పోలిస్తే...ఇందులో మూడు రెట్ల ప్రోటీన్లు ఉన్నాయి.

Advertiesment
Health Benefits
, ఆదివారం, 14 ఆగస్టు 2016 (10:44 IST)
ఉసిరికాయలో ఎన్నో ఆరోగ్య విలువలు, ఔషధ లక్షణాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. పుల్ల పుల్లగా వగురుగా ఉండే ఈ ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌‌తో పోలిస్తే...ఇందులో మూడు రెట్ల ప్రోటీన్లు ఉన్నాయి. దానిమ్మపండుతో పోలిస్తే దాదాపు 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి పుష్కలంగా ఉన్నాయి. 
 
ఉసిరికాయ రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా పేరుకు పోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకపాత్రను పోషిస్తుంది. అలసటను దూరం చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. హృద్రోగం, మధుమేహం రాకుండా కాపాడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 
 
కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిలో ఉన్న విటమిన్‌ ''సి'' శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. జుట్టుకు కావలసిన పోషణను అందిస్తుంది. చుండ్రు, కేశ సంబంధిత అనేక సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ అన్నం తింటే సరిపోదు.. పండ్లు కూడా తీసుకోవాలి.. అప్పుడే సంతోషంగా ఉంటారు