Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? 40 రోజుల్లో పొట్ట తగ్గాలా..? ఐతే ఇలా చేయండి!

కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా? అయితే తేనేతో మీకు చాలా పనుంది. ఊబకాయంతో బొజ్జ పెరిగిపోతుంటే.. తేనెను నీటిలో కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడున తాగండి. రెండు నెలలకే బొజ్జ తగ్గిపోతుంది. తేనెలోని

Advertiesment
Health Benefits of Honey and its Various Uses
, సోమవారం, 1 ఆగస్టు 2016 (10:50 IST)
కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా? అయితే తేనేతో మీకు చాలా పనుంది. ఊబకాయంతో బొజ్జ పెరిగిపోతుంటే.. తేనెను నీటిలో కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడున తాగండి. రెండు నెలలకే బొజ్జ తగ్గిపోతుంది. తేనెలోని గ్లూకోజ్ రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. తద్వారా గుండెపోటు వ్యాధులు దరిచేరవు. కంటి జబ్బులు, చర్మ సంబంధిత వ్యాధులు కూడా తేనె వాడకంతో నయమవుతాయి.
 
అలాగే అల్లం రసంతో తేనెను కలిపి కాస్త వేడిచేసి ఆరబెట్టాలి. ఈ రసాన్ని తినేందుకు ముందు ఒక స్పూన్, సాయంత్రం ఒక టేబుల్ స్పూన్ వేడినీటితో కలుపుకుని తాగితే 40 రోజుల్లో పొట్ట తగ్గిపోతుంది. ఇక అనాస పండులో కూడా పొట్టను తగ్గించే గుణం ఉంది. అనాసపండు ముక్కల్ని, వోం పొడితో నీళ్లలో రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం ఆ రసాన్ని పరగడుపున తాగితే మీ పొట్ట తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. 
 
తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. 
 
ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. ఇలా శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనెను గోరువెచ్చని నీటితో పరగడుపున సేవిస్తే అధిక బరువు తగ్గుతారు. తేనెను గోరువెచ్చని పాలతో సేవిస్తే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్షాకాలంలో పెప్పర్ మింట్ టీ తాగితే.. బరువు తగ్గేది కాదు.. కఫం వదిలిపోద్ది!