Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్షాకాలంలో పెప్పర్ మింట్ టీ తాగితే.. బరువు తగ్గేది కాదు.. కఫం వదిలిపోద్ది!

వర్షాకాలంలో మిరియాలు, పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వర్షాకాలంలో ఏర్పడే కఫానికి ఈ రెండు దివ్యౌషధంగా పనిచేస్తాయి. శరీర బరువును తగ్గిస్తాయి. మిరియాల టీ తాగడంతో పాటు వ్యాయామాలు, పౌష్టికాహారం తీసు

Advertiesment
pepper mint tea health benefits
, సోమవారం, 1 ఆగస్టు 2016 (10:30 IST)
వర్షాకాలంలో మిరియాలు, పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వర్షాకాలంలో ఏర్పడే కఫానికి ఈ రెండు దివ్యౌషధంగా పనిచేస్తాయి. శరీర బరువును తగ్గిస్తాయి. మిరియాల టీ తాగడంతో పాటు వ్యాయామాలు, పౌష్టికాహారం తీసుకోవాలి. ఘాటైన వాసనతో కూడిన మిరియాల టీ ఆకలిని అణచివేస్తుంది. స్వీట్లు లేదా అధిక క్యాలోరీలు గల భోజనాలు తినటానికి ఇష్టపడితే.. తిన్నాక మిరియాల టీ తాగండి.
 
మిరియాలతో చేసిన టీ, కొవ్వు పదార్థాలను సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇంకా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చేపలో ఉన్నట్లే మిరియాల టీలోనూ కూడా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. మిరియాల టీలో కాస్త పుదీనా కూడా చేర్చుకుంటే ఆరోగ్యానికి బలం, ఉత్తేజం చేకూరుతుంది. దగ్గు, జలుబు దరిచేరదు. 
 
ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలనుకునే వారు, ఒత్తిడికి దూరం కావాలనుకునే వారు మిరియాల టీ తాగటం ద్వారా తగ్గించుకోవచ్చు. మిరియాల టీ, శరీర వ్యవస్థలను విశ్రాంతికి గురి చేసి, ఒత్తిడిని తగ్గించి, శరీరాన్ని తిరిగి గాడిలో పడేలా చేస్తుంది. ఈ టీలోని విటమిన్ సీ వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని, శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంకా ఈ టీలో పుదీనా చేర్చుకుంటే.. పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధిత మొటిమలు    నివారించబడతాయి.
 
చిరుతిండ్లు, పండ్ల రసాలు, సలాడ్లు, ఏవైనా సరే పుదీనా ఆకుతో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరినట్లవుతుంది. పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలను పోగొడతాయి. పుదీనా ఆకులను పేస్ట్ చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడుశ్వాస నివారించబడుతుంది. పుదీనా శరీర రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న పుదీనా ఆకును వంటకాలతో పాటు చాయ్‌లా సేవించినా.. పచ్చళ్ల రూపంలో తీసుకున్నా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరటి పండు తొక్క.. అలెవెరా జల్‌తో మేలెంత..?