Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణాలివే..?

జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణాలివే..?
, గురువారం, 5 డిశెంబరు 2019 (21:53 IST)
శిరోజాలు  మృదువుగా, పట్టుకుచ్చులా ఉంటే చూడముచ్చట గొలుపుతాయి. శిరోజాలు మూడుపొరలుగా వేల కణాలతో కూడి ఉంటాయి. వెంట్రుకలకు తగిన తేమ దొరకనప్పుడు జుట్టు పొడి బారిపోతుంది. దీని వల్ల శిరోజాల మెరుపు తగ్గిపోయి నిస్సారంగా కనబడతాయి. 
 
జుట్టు చిక్కులు పడిపోతూ ఉంటుంది. పేలవంగా మారుతుంది. స్త్రీపురుషులిద్దరికీ ఏ వయస్సులో అయినా పొడిజుట్టు సంభవిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. సరైన పోషకాలు అందనప్పుడు అనారోగ్యం కలిగినప్పుడు జుట్టుకు హాని జరుగుందట. ముఖ్యంగా అతి వేడివల్ల పరికరాల ఒత్తిడి వల్ల వెంట్రుకల చివర్లు చీలిపోవడాన్ని జుట్టు చిట్లిపోవడం అంటారట.
 
ప్రధానంగా జుట్టు ఊడిపోవడానికి ఇవే కారణాలు.. పోషకాహారలేమి..స్టయిలింగ్ ఉత్పత్తుల్ని అంటే జెల్, వ్యాక్స్ లు స్ప్రేలు అధికంగా వాడడటం, బ్లో డ్రయర్ లు, హాట్ కోంబ్స్ వంటి స్టయిలింగ్ టూల్స్ ఎక్కువగా వాడడం, అతిగా తలస్నానం చేయడం, అధిక కెమికల్ ట్రీట్ మెంట్స్, రెగ్యులర్ గా ట్రిమ్ చేయకపోవడం, సరిగ్గా చిక్కులు విడదీయకపోవడం, అలంకరణ హెయిర్ కేర్ ఉత్పత్తులు ఎక్కువగా వాడడం, ఎక్కువ వేడినీరు ఉపయోగించడం కారణమంటున్నారు. 
 
అయితే చిక్కుల జుట్టుకు అవకాడో ఆధారిత హెయిర్ మాస్క్ అత్యంత ప్రాచుర్యం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవకాడోలో విటమిన్ ఇ ఎక్కువగా అందులో ఉంటుందట. ఇది చిక్కులను నివారిస్తుందట. చర్మకణాలను ఆక్సిడైజింగ్ నుంచి కూడా పరిక్షిస్తుందట. ఒమెగా 3ప్యాటీ యాసిడ్స్ కు మంచి ఆధారమట. ఈ యాసిడ్స్ చిక్కుల హాని జరిగిన శిరోజాలను మెరుగుపరుస్తాయట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టమోటా, ఆనియన్ ఎగ్ న్యూడిల్స్ ఎలా చేయాలంటే?