Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువతుల్లో జుట్టు రాలే సమస్య... ఇలా చేస్తే అధిగమించవచ్చు

Advertiesment
Hair fall
, మంగళవారం, 15 అక్టోబరు 2019 (14:06 IST)
జుట్టు రాలిపోవడం మగవారిని ఎక్కువగా వేధిస్తుంటుంది. ఇప్పుడు యువతులు కూడా జుట్టు రాలే సమస్యతో బెంబేలెత్తిపోతున్నారు. వాతావరణ కాలుష్యం ఒకవైపు ఏవేవో షాంపూలు వాడటంతో జుట్టు రాలే సమస్య తలెత్తుతోంది. వీటితోపాటు సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ల లోపం, జన్యుపరమైన కారణాలు, అధిక ఒత్తిడి, రక్త ప్రసరణ సరిగా లేకపోవుట, అపరిశుభ్రమైన చర్మముతో జుట్టు రాలి పోతుంది. 
 
అలాంటప్పుడు జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు సరైన ఆహారం తీసుకుంటున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
 
1. మహిళలు ఉసిరికాయతో తయారు చేసిన నూనె జుట్టుకు ఉపయోగిస్తే నునుపైన కర్లీ జుట్టును పొందవచ్చు. 
 
2. ప్రతి రోజు రాత్రి నీటిలో 5 బాదం పప్పులను నానబెట్టి ఉదయం దాని తొక్కలు తీసి తింటే హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. 
 
3. జుట్టుకు పోషణ అవసరం. అందువలన మజ్జిగ, నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు వంటి జ్యూస్‌లను రోజుకు రెండు సార్లైనా తాగండి. అలాగే ప్రతి రోజు కనీసం 8-10 గ్లాసుల నీటిని త్రాగాలి.
 
4. రోజూ ఒక కప్పు మొలకెత్తిన పప్పు ధాన్యాలను తీసుకోవాలి. 
 
5. ప్రోటీన్ల కోసం చికెన్, గుడ్డు ప్రతి రోజు తినాలి.
 
6. ప్రతి రోజు టీ, కాఫీలను తీసుకోవడం తగ్గించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూ సిల్లీ, ఇప్పుడవన్నీ ఎందుకని వెళ్లిపోయింది... ఏం చేయాలి?