Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రీన్ టీ తాగితే లాభాలని అంటారు... నిజమేనా?

ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ.. కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం. గ్రీన్ టీలో ఎలాంటి క్యాలరీలుండవు. అయితే కొద్దిగా షుగర్ వేయడం వల్ల, ‘వెయిట్ లాస్ ఫ్రెం

Advertiesment
green tea health benefits
, గురువారం, 1 జూన్ 2017 (22:46 IST)
ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ.. కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం. గ్రీన్ టీలో ఎలాంటి క్యాలరీలుండవు. అయితే కొద్దిగా షుగర్ వేయడం వల్ల, ‘వెయిట్ లాస్ ఫ్రెండ్లీ' అనే ట్యాగ్ దానంతట అదే కోల్పోయినట్లే. ముఖ్యంగా స్వీట్ గ్రీన్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. అందువల్ల సాధారణంగా బరువు తగ్గాలనుకొనేవారు గ్రీన్ టీలో షుగర్‌కు బదులుగా తేనె కలుపుకుని తాగినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. 
 
గ్రీన్ టీని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. అదే మోతాదుకు మించితే, మనస్సు మీద దుష్ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీలో ఉండే అధిక యాంటీయాక్సిడెంట్స్ హార్మోనులను విడగొట్టడం వల్ల గ్రంథుల్లో మార్పులు వస్తాయి. అందువల్ల రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించి తాగరాదు. 
 
గ్రీన్ టీలో కెఫిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. కెఫిన్ తక్కువగా తీసుకుంటే, శరీరానికి కొన్ని ప్రయోజనాలుంటాయి. కెఫిన్ ఎక్కువైతే శరీరంలో నార్మల్ బాడీ ఫంక్షన్స్ పని చేయడం కష్టమవుతుంది. గ్రీన్ టీలో టానిన్ అనే కంటెంట్ ఉదరంలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఎక్కువ హాని కలిగించకపోయినా, ఉదర సమస్యలకు దారితీస్తుంది. 
 
రక్తంలో న్యూట్రిషియన్స్ షోషణ గ్రీన్ టీ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ ఇది. ఇందులో ఉండే టానిన్ రక్తంలో షోషింపబడే కొన్ని న్యూట్రిషియన్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇలా అనేక దుష్ప్రభావాలు ఉన్నట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ మతిమరుపుకు చెక్ ఎలా?