Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేథో సంపత్తిని పెంచే స్వల్ప ఆహార మార్పులు

మానవ శరీరంలో మెదడు అత్యంత శక్తివంతమైన భాగం అన్న సంగతి అందరికీ తెలిసిందే. కండరాలు ధృడంగా తయారు కావాలంటే ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని ఎలా తీసుకుంటామో, మెదడు చురుకుగా పని చేసేందుకు కూడా తగిన ఆహారం తీసుకోవాల

Advertiesment
Glucose
, శనివారం, 10 సెప్టెంబరు 2016 (11:53 IST)
మానవ శరీరంలో మెదడు అత్యంత శక్తివంతమైన భాగం అన్న సంగతి అందరికీ తెలిసిందే. కండరాలు ధృడంగా తయారు కావాలంటే ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని ఎలా తీసుకుంటామో, మెదడు చురుకుగా పని చేసేందుకు కూడా తగిన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలోనే చిన్నపాటి మార్పులు చేస్తే చక్కటి మేధోశక్తిని సొంతం చేసుకోవచ్చు.
 
సాధారణంగా నలభై సంవత్సరాలు దాటిన వారికి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అయితే, తగిన ఆహారం తీసుకోవటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుదలను పూర్తిగా అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. మెదడు చురుకుగా పని చేసేందుకు అవసరమైన శక్తిని గ్లూకోజ్ మెదడుకు అందజేస్తుంది. పొద్దున్నే మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఈ గ్లూకోజ్‌ను అందజేస్తుంది. 
 
బ్రేక్‌ఫాస్ట్ మానివేసిన మహిళలకైతే ఉద్యోగ జీవితంలో డ్యూటీ నిర్వహణలో తెలియని ఒకరకమైన చిరాకు వేధిస్తుంది. అదే చిన్నపిల్లలకయితే స్కూల్లో చురుకుదనంతో ఉండరు. కాబట్టి, ఉదయంపూట తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో బీన్స్, మొలకెత్తిన గింజలు లాంటివి తీసుకునేవారు చాలా చురుకుగా వ్యవహరిస్తారు. చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
 
వీటితోపాటు పాలు కూడా తప్పనిసరిగా తీసుకుంటే మంచిది. అలాగే పీచు ఉండే ఆహార పదార్థాలు, ఆకుకూరలు లాంటి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. ఇకపోతే, పొద్దున్నే బేకరీలలో తయారైన వస్తువులను తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి ఫాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయకపోవడమే కాకుండా, వీటిలోని క్యాన్సర్ కారకాలు శరీరానికి హాని చేస్తాయి.
 
అలాగే... మధ్యాహ్న భోజనంలో కోడిగ్రుడ్లను ప్రతిరోజూ తీసుకుంటే చాలామంచిది. కోడిగుడ్డు నుండి మన శరీరం స్యూరో ట్రాన్స్‌మీటర్స్‌ను తయారు చేసుకుంటుంది. ఎసెటిల్కోలైన్ దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది గనుక శరీరంలో లోపిస్తే ఆల్జిమర్స్ వ్యాధి వస్తుంది.
 
అంతేగాకుండా న్యూరో ట్రాన్స్‌మీటర్స్ మన మేధో శక్తిని పెంచుతాయి. మెదడును ఉత్తేజపూరితం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పళ్ళు, పచ్చటి కూరలే శరీరాని మిత్రులనే విషయాన్ని ఎన్నడూ మరచిపోవద్దు. వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉండటమే గాకుండా, పైబర్ అత్యధిక స్థాయిలో ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడుము నొప్పితో బాధపడుతున్నారా... ఐతే బరువు తగ్గించండి