Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో జీవక్రియ మెరుగుపడాలంటే? కారం కాస్త తినాల్సిందే

జీవక్రియను మెరుగుపరుచుకోవాలంటే.. కారం తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవిలో కారం తక్కువ తీసుకోవాలి. అయితే తక్కువ కారం తీసుకోకూడదు. కారం మితంగా తీసుకోవడం ద్వారా శరీరంలోని కొవ్వు కరుగుతుంద

వేసవిలో జీవక్రియ మెరుగుపడాలంటే? కారం కాస్త తినాల్సిందే
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (15:33 IST)
జీవక్రియను మెరుగుపరుచుకోవాలంటే.. కారం తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవిలో కారం తక్కువ తీసుకోవాలి. అయితే తక్కువ కారం తీసుకోకూడదు. కారం మితంగా తీసుకోవడం ద్వారా శరీరంలోని కొవ్వు కరుగుతుందని పరిశోధనలు తేల్చాయి. అందుకే పరిశోధకులు కారంగా ఉండే ఆహార పదార్థాలను వారంలో నాలుగు సార్లైనా తీసుకోవాలంటున్నారు. 
 
ఇంకా వేసవిలో జీవక్రియలను మెరుగుపరుచుకోవాలంటే.. నీటిని ఎక్కువ తీసుకోవాలి. పెరుగు, మజ్జిగను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులోని క్యాల్షియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు పెరుగును మనం తీసుకోవడం ద్వారా శరీరానికి 18 శాతం క్యాల్షియాన్ని అందించిన వారమవుతామని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వేసవిలో బరువు పెరిగే ఆహారాన్ని తీసుకోకూడదు. బరువు తగ్గించడంలో దృష్టి పెట్టాలి. ఆకుకూరలు జ్యూస్, అల్లం జ్యూస్ అరగ్లాసు మేర తీసుకోవాలి. ఆకు కూరల జ్యూసులో ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మెటబాలిక్ రేటును పెంచుతాయి. దాంతో శరీరంలో ఉండే కొవ్వు చాలా వేగంగా కరుగుతుంది. అల్లంలోని అల్లిసిన్ అనే పదార్థం.. పవర్‌ఫుల్ ఎంజైమ్‌గా పనిచేస్తుంది. ఇది వేగంగా ఫ్యాట్‌ను బర్న్ చేస్తుంది. దాంతో బరువు సులభంగా తగ్గుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొప్పాయి పండును అప్పుడప్పుడు పిల్లలకు పెడితే ఏమౌతుందో తెలుసా?