బొప్పాయి పండును అప్పుడప్పుడు పిల్లలకు పెడితే ఏమౌతుందో తెలుసా?
వేసవిలో బొప్పాయిని మితంగా తీసుకోవాలి. రోజుకు అరకప్పు మేర తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా బొప్పాయి పండును అప్పడప్పుడు పిల్లలకు పెడితే బాగా పెరుగుతారు. ఎముకలు బలపడతాయి. నరాల బలహీనత తగ్గుతుంది. బొప్పాయిలో
వేసవిలో బొప్పాయిని మితంగా తీసుకోవాలి. రోజుకు అరకప్పు మేర తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా బొప్పాయి పండును అప్పడప్పుడు పిల్లలకు పెడితే బాగా పెరుగుతారు. ఎముకలు బలపడతాయి. నరాల బలహీనత తగ్గుతుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, బీ-9, సీ, ఈ, కెలతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఇన్స్‌సొల్యూబల్ ఫైబర్ వంటి ధాతువులు పుష్కలంగా ఉంటాయి.
పిల్లలకు వేసవిలో లభించే పండ్లను ఇవ్వాలి. పుచ్చకాయ, దోసకాయ వంటివి పండ్లను ఇస్తుండాలి. బత్తాయి రసం తాగించాలి. రోజుకు ఓ ఆపిల్ పండును తినిపించాలి. రక్తహీనత, సక్రమ రక్తప్రసరణ, మెదడుకు మేలు చేస్తుంది. పేగులోని క్రిములను నశింపజేస్తుంది. కిడ్నీ సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. హృద్రోగ వ్యాధులను దూరం చేస్తుంది.
అలాగే మహిళలు మోకాలి నొప్పి, నడుము నొప్పి, నరాలకు సంబంధించి వ్యాధుల్ని దూరం చేసుకోవాలంటే రోజుకో ఆపిల్ పండు తీసుకుంటే సరిపోతుంది. అలాగే చిన్నారులకు ద్రాక్ష పండ్లు వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. జ్వరం, జలుబు ఏర్పడితే ద్రాక్ష పండ్ల రసాన్ని తాగిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.