Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

Advertiesment
Coffee
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
రాత్రి వేళ నిద్రా భంగం కాకుండా వుండాలంటే తగిన ఆహారం తీసుకోవాలి. నిద్రకు ఇబ్బందికరంగా మారే 9 పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
 
నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ, చాక్లెట్ల వంటివి తింటే సరైన నిద్ర లేకుండా అవుతుంది.
మద్యం సేవిస్తే మత్తుగా నిద్రపడుతుందని అంటారు కానీ అది నిద్రాభంగం కలిగిస్తుంది.
చక్కెర స్థాయిలు అత్యధికంగా వున్న స్వీట్స్ కూడా మోతాదుకి మించి తింటే రాత్రి సరిగా నిద్రపట్టదు.
కార్బొనేటెడ్ పానీయాలు తాగడం వల్ల కడుపులో గడబిడగా వుండి నిద్రలేకుండా చేస్తాయి.
రాత్రి నిద్రపోయే ముందు కడుపు నిండుగా భోజనం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందువల్ల కాస్త ఖాళీ వుంచేట్లు చూడాలి.
స్పైసీ ఫుడ్ రాత్రివేళ తీసుకుంటే దానివల్ల గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు తలెత్తి నిద్రాభంగం అవుతుంది.
అధిక కొవ్వులతో కూడిన ఆహారమైన ఫ్రైడ్ ఫుడ్, మాంసాహారం రాత్రిపూట తినకుండా వుండటం మంచిది.
పుల్లపుల్లగా వుండే పండ్లను కూడా రాత్రి నిద్రకు ముందు తింటే వాటి వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట తలెత్తుతుంది.
అధికంగా ఉప్పుతో కూడిన ఆహార పదార్థాలకు రాత్రిపూట దూరంగా వుండటం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?