వారానికి 2 నుంచి 6 టమోటాలను తింటే.. ఒత్తిడి మటాష్..
టమోటాలను తరచూ తింటూ ఉంటారా.. అయితే మీలో ఒత్తిడితో తలెత్తే సమస్యలు పరిష్కారమైనట్లే. ఆశ్చర్యపోకండి ఇది నిజమే.. తరచూ టమోటాలు తినడం వల్ల ఒత్తిడి సమస్యలు చాలామటుకు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. టమాటాల్లో
టమోటాలను తరచూ తింటూ ఉంటారా.. అయితే మీలో ఒత్తిడితో తలెత్తే సమస్యలు పరిష్కారమైనట్లే. ఆశ్చర్యపోకండి ఇది నిజమే.. తరచూ టమోటాలు తినడం వల్ల ఒత్తిడి సమస్యలు చాలామటుకు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. టమాటాల్లోని లైసోపెన్ అనే యాంటీఆక్సిడెంట్లు అనేక వ్యాధులను దరిచేరకుండా నిరోధించడంతో పాటు ప్రొటెస్ట్ క్యాన్సర్, గుండెపోటు వంటి రోగాలను తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.
అంతేకాకుండా రక్త పీడనాన్ని తగ్గించి, వయసు పైబడటం ద్వారా కలిగే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అందుకే వారానికి రెండు నుంచి ఆరు టమోటాలు తింటే వారికి డిప్రెషన్ భయమే ఉండదని, వారికి డిప్రెషన్ సోకే అవకాశాలు 46శాతం వరకూ తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. రోజుకు ఒక టమోటా తినే వారికి ఈ భరోసా 52 శాతం వరకూ ఉంటుందన్నారు. టమోటాల్లో రోగనిరోధక శక్తిని పెంచే 'గ్లుటాథైయోన్'లు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.