Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రి పూట 3 గంటలు సోషల్ మీడియా వాడే పిల్లల్లో సంతోషం ఉండదండోయ్..

సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు ఇప్పటికే గంగలో కలిసిపోయాయని సర్వేలో తేల్చాయి. ఎందరో దంపతులు సోషల్ మీడియా కారణంగా తమ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. అలాంటి సోషల్ మీడియా మేలు మాత్రం కొంతే

రాత్రి పూట 3 గంటలు సోషల్ మీడియా వాడే పిల్లల్లో సంతోషం ఉండదండోయ్..
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (17:39 IST)
సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు ఇప్పటికే గంగలో కలిసిపోయాయని సర్వేలో తేల్చాయి. ఎందరో దంపతులు సోషల్ మీడియా కారణంగా తమ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. అలాంటి సోషల్ మీడియా మేలు మాత్రం కొంతే అయితే.. కీడు మాత్రం నాలుగింతలు ఎక్కువేనని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
తాజాగా సోషల్ మీడియా పిల్లలకూ ముప్పు తప్పదని బ్రిటన్‌లోని ఎసెక్స్‌ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఎలాగంటే..? సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వెబ్ సైట్లను ఏ పిల్లలైతే తరచూ వాడుతుంటారో వాళ్ళు.. సోషల్ మీడియా ఉపయోగించని పిల్లల కంటే హ్యాపీగా ఉండలేరని తేలింది. అంతేకాకుండా సోషల్ మీడియాను తరచూ వాడే పిల్లలు.. తల్లిదండ్రులతో తరచూ గొడవకు దిగుతారని.. వారితో సంబంధాలను బలపరుచుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించరని పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
దాదాపు మూడువేల ఐదు వందల మంది పిల్లల మీద జరిగిన పరిశోధనలో 10-15 ఏళ్ల వయస్సున్న పిల్లలు పాల్గొన్నారు. వీరిపై జరిగిన పరిశోధనలో రోజుకు ఒక రాత్రి పూట 3 గంటల పాటు ఎవరైతే సోషల్ మీడియా వాడుతున్నారో వారిలో కేవలం 53 శాతం మంది మాత్రమే హ్యాపీగా ఉన్నారని వెల్లడైంది. ఎఫ్‌బీ, ట్విటర్‌ వంటివేవీ వాడని పిల్లలు 83 శాతం సంతోషంగా ఉండగలుగుతున్నారని ఈ పరిశోధన తేల్చింది. సో.. పిల్లలకు సోషల్ మీడియాను అలవాటు చేయకపోవడం ఎంత బెటరని తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిందే..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోళ్లు సురక్షితంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?