Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒత్తిడి ఎలా వస్తుంది.. ఎలా తగ్గించుకోవాలి...?

blood pressure
, గురువారం, 27 ఏప్రియల్ 2023 (18:59 IST)
ఒత్తిడి.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. చిన్న పిల్లల మొదలుకుని పెద్దల వరకు ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుందన్న విషయాన్ని పరిశీలిస్తే, శరీరంలో అడ్రినాలిన్, కార్టిసోల్ హార్మోన్లు విడుదలవ్వటం వల్ల ఈ ఒత్తిడి వస్తుంది. ఇంతకీ మనకు ఒత్తిడి ఎలా వస్తుందో తెల్సుకుంటేనే... దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుస్తుంది. కాస్త జాగ్ర త్తలు పాటిస్తే ఒత్తిడిని కొంతమేరకు నివారించవచ్చు.
 
సాధారణంగా ఒత్తిడి అనేక రకాలుగా వస్తుంది. వాటిలో మొదటి 'పర్యావరణ ఒత్తిడి'. మన చుట్టూ ఉండే వాతావరణం, శబ్దాలు, కాలుష్యం, ఉష్ణోగ్రత్తల వల్ల ఇది కలుగుతుంది. ఇక రెండోది వ్యక్తిగత ఒత్తిడి. ఒక వ్యక్తిని ఆర్థిక సమస్యలు వెంటాడటం, ఇంటి సమస్యలు, కొత్త నగరానికి వెళ్లటం, కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఇలాంటి ఒత్తిడి ఎదుర్కుంటారు. 
 
ఇక పనికి సంబంధించిన ఒత్తిడి మూడోది. ఇది ఆఫీసులో ఏర్పరుచుకునే లక్ష్యాలు, పని ఒత్తిడి, డెడ్‌లైన్స్, సహోద్యోగులతో గొడవలు లాంటి వాటివల్ల వస్తుంది. చివరిది ఆరోగ్యపరమైన ఒత్తిడి. దీర్ఘకాలిక సమస్యలు ఉండటం, నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలు, వైకల్యం, మానసిక సమస్యలు వీటి కిందకు వస్తాయి. పలురకాల ఒత్తిళ్లు ఎంతో ఇబ్బంది పెడతాయి. అయితే స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేసుకునే చిట్కాలు తెలుసుకోవటం ముఖ్యం.
 
ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు... 
ఒత్తిడిని జయించాలంటే ముందు ఒత్తిడి ఎలా కలుగుతుందో తెలుసుకోవాలి. దానికి తగినట్లు నివారణ మార్గాలు చేపట్టాలి. అప్పుడే ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సరైన పోషకాలుండే ఆహారం, కంటినిండా నిద్రపోతే ఒత్తిడి గణనీయంగా తగ్గుముఖంపడుతుంది. ముఖ్యంగా సంతోషంగా ఉండటం, ప్రకృతితో గడపటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
 
ముఖ్యంగా, ఒంటరిగా ఉండకుండా జనాలతో కలివిడిగా ఉండటం నేర్చుకోవాలి. ప్రస్తుతం ఉండే క్షణాలను ఆస్వాదించే ప్రెజెంట్‌మైండ్‌ను అలవర్చుకోవాలి. రోజును సరిగ్గా ప్లాన్ చేసుకోవటం వల్ల కూడా ఒత్తిడి కనపడదు. శారీరక వ్యాయామాలు చేయడం వల్ల ఎండార్ఫిన్ విడుదలై ఒత్తిడి తగ్గిపోతుంది. యోగా, మెడిటేషన్ లాంటివి చేయటం చేస్తే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నట్లు అర్థమవుతుంది. ప్రధానంగా ఒత్తిడిని జయించటానికి నిపుణుల సలహాలు తీసుకోవటం కూడా మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తిమీరను తాజాగా ఎలా భద్రపరచాలో తెలుసా?