వ్యాయామం చేసేందుకు టైమ్ లేదనుకుంటే.. ఇలా చేయండి..
వ్యాయామం చేసేందుకు టైమ్ లేదంటే.. మెట్లెక్కి దిగండి. కుర్చున్న చోట కాళ్లు, చేతులు సాగదీయండి, గుంజిళ్లు తీయండి. లేకుంటే చేతుల్ని గుండ్రంగా తిప్పడం వంటివి కూడా వ్యాయామంలో భాగమే. అందుకే ఓ పావు గంట ఇలా చేయ
వ్యాయామం చేసేందుకు టైమ్ లేదంటే.. మెట్లెక్కి దిగండి. కుర్చున్న చోట కాళ్లు, చేతులు సాగదీయండి, గుంజిళ్లు తీయండి. లేకుంటే చేతుల్ని గుండ్రంగా తిప్పడం వంటివి కూడా వ్యాయామంలో భాగమే. అందుకే ఓ పావు గంట ఇలా చేయండి. తప్పనిసరిగా వ్యాయాయం చేయాలనే నియమాన్ని పెట్టుకోకుంటే.. ఏదైనా డ్యాన్స్ క్లాసులో చేరండి. ఇక కాసేపు మీకు నచ్చిన ఆటను ఆడుకోండి.
* సైకిలు తొక్కడం మొదలుపెట్టండి. చిన్నచిన్న పనులకు దానిపై వెళ్లడం అలవాటుగా మార్చుకుని చూడండి. అలాగే ఓ పదినిమిషాలు దొరికాయా. ఆ కాసేపూ తాడాట ఆడండి. లేదా ఉన్నచోటే గెంతే ప్రయత్నం చేయండి. ఇవన్నీ వ్యాయామంలో భాగమే.
* వ్యాయామం చేస్తున్నా సరే.. వీలైనంత ఎక్కువగా నడిచేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. అది వ్యాయామంలా అనిపించదు కానీ..తెలియకుండానే కెలొరీలు ఖర్చవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.