Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎండు ద్రాక్షతో రక్తహీనతకు చెక్...

మార్కెట్‌లో లభ్యమయ్యే డ్రై ఫూట్స్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలో ఒకటి ఎండు ద్రాక్ష. దీన్ని ఆరగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. దీన్ని ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Advertiesment
Dry Grapes
, మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (09:12 IST)
మార్కెట్‌లో లభ్యమయ్యే డ్రై ఫూట్స్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలో ఒకటి ఎండు ద్రాక్ష. దీన్ని ఆరగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. దీన్ని ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు ఈ పండ్లను ఆరగించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. తద్వారా శరీరంలో రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఎండు ద్రాక్షల్లో విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. 
 
వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు. విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పోటాషియం అధికంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే ఎండు ద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఆ సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. ఎండు ద్రాక్షల్లో క్యాల్షియం మెండుగా ఉంటుంది. ఇది పిల్లల్లో ఎముకల పెరుగుదలకు, గట్టిదనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే, పిల్లల పెరుగుదలకు, గర్భిణీలకు ఎండు ద్రాక్షలు ఎంతగానో మేలు చేస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలాంటి పురుషులంటే స్త్రీలు ఇష్టపడుతారో తెలుసా?