Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోడ్ల మీద అమ్మే తిండి తింటే అంతే సంగతులు (video)

నగరవాసులు పనుల హడావుడిలో ఆరోగ్యంపై శ్రద్ధ లేకుండా ఏవి పడితే అవి తినేస్తున్నారు. వారి ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. ఉద్యోగాల కోసం పరుగులు తీస్తూ.. పోషకాహారంపై ఏమాత్రం శ్రద్ధ చూపట్లేదు. దీని ఫలితం ఒబిసి

రోడ్ల మీద అమ్మే తిండి తింటే అంతే సంగతులు (video)
, బుధవారం, 1 ఆగస్టు 2018 (13:22 IST)
నగరవాసులు పనుల హడావుడిలో ఆరోగ్యంపై శ్రద్ధ లేకుండా ఏవి పడితే అవి తినేస్తున్నారు. వారి ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. ఉద్యోగాల కోసం పరుగులు తీస్తూ.. పోషకాహారంపై ఏమాత్రం శ్రద్ధ చూపట్లేదు. దీని ఫలితం ఒబిసిటీ. అంతేకాదు.. పలు అనారోగ్య సమస్యలు, మధుమేహం, గుండె సంబంధిత రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. 
 
ముఖ్యంగా పని ఒత్తిడి, గంటల తరబడి ప్రయాణాలు వంటి ఇతరత్రా కారణాల చేత.. ఆకలికి తట్టుకోలేక నగరవాసులు బండ్లలో అమ్మే ఆహార పదార్థాలను తినేస్తున్నారు. కడుపు నింపుకొనేందుకు.. రోడ్డు పక్కన తోపుడు బండ్లపై దొరికే ఆహారమ్మీద నగరవాసులు ఆధారపడుతున్నారు. దీంతో చిరు వ్యాపారులు పెరిగిపోతున్నారు. అయితే బండి తిండి ఆరోగ్యకరం కాదని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) హెచ్చరిస్తోంది. 
 
రహదారుల పక్కన లభించే ఆహారపదార్థాలు ఎంతవరకు ఆరోగ్యకరమనే అంశాన్ని ఎన్‌ఐఎన్‌ గతంలో సర్వే నిర్వహించింది. కోసి ఉంచిన ఉల్లిపాయలు, మిరపకాయలు, మూతల్లేని ఆహార నిల్వ పాత్రలతో రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఈ సర్వేలో తేలిపోయింది. పానీ పూరీలు, కర్రీ షాపులు, చిన్ని చిన్ని ఫాస్ట్ ఫుడ్స్, రెస్టారెంట్లలో నిల్వచేసి వుంచిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని ఎన్ఐఎన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇంటి ఆహారమే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్ఐఎన్ స్పష్టం చేసింది. 
 
రోడ్ల పక్కనే అమ్మే ఆహార పదార్థాల్లో శుభ్రత లేదని.. ఆ అశుభ్రతే రోగాల బారిన పడేందుకు కారణమవుతున్నాయని ఎన్ఐఎన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో బండి తిండి ఎంతవరకు తీసుకోకపోవడమే మంచిదని ఎన్ఐఎన్ తేల్చి చెప్పేసింది. 
 
జీహెచ్‌ఎంసీ ఆహార తనిఖీ బృందాలు తరచూ పరిశీలించి.. ప్రజసకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అని పరిశీలించాలని ఎన్ఐఎన్ సూచించింది. రహదారులు పక్కన తోపుడు బండ్ల నిర్వాహకులు తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు ధరించాలని, దుమ్ము ఉన్న ప్రాంతం, మురుగు కాల్వల పక్కన బండిని ఉంచి తిండి పెట్టవద్దని ఎన్ఐఎన్ సూచన చేసింది. 
webdunia
 
ప్రతి వంటకం మీద తప్పనిసరిగా మూతలు వేసే ఉంచాలని, ముందుగానే ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కొత్తిమీర కోసి ఉంచవద్దని పేర్కొంది. వంట చేసేవారు, పానీపూరి, తినుబండారాలు అందజేసేవారు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. స్టార్‌ హోటల్లో మాదిరి నెత్తిన క్యాప్‌ పెట్టుకోవాలి. శుద్ధిచేసిన నీటిని అందించాలని షాపు యజమానులకు ఎన్ఐఎన్ తెలిపింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ అధికారులు చొరవ తీసుకుని ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేలా చూడాలని ఎన్ఐఎన్ స్పష్టం  చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా? ఎలా తప్పించుకోవాలంటే? (vide0)