Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా? ఎలా తప్పించుకోవాలంటే? (vide0)

బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా.. శరీరంలో ఐరన్-ప్రోటీన్ లోపం వల్లేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఐరన్ లోపంతో జుట్టు రాలడం అధికమవుతుంది. తద్వారా బట్టతల వచ్చేస్తుంది. అందుకే ఐరన్‌-ప్రోటీన్‌ ఆధారిత ఆహ

బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా? ఎలా తప్పించుకోవాలంటే? (vide0)
, బుధవారం, 1 ఆగస్టు 2018 (11:58 IST)
బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా.. శరీరంలో ఐరన్-ప్రోటీన్ లోపం వల్లేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఐరన్ లోపంతో జుట్టు రాలడం అధికమవుతుంది. తద్వారా బట్టతల వచ్చేస్తుంది. అందుకే ఐరన్‌-ప్రోటీన్‌ ఆధారిత ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వయసు మీరుతున్న కొలదీ, హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ, ప్రారంభం నుండే జుట్టును కాపాడుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవటం వలన జుట్టు రాలటాన్ని తగ్గించుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు వెంట్రుకల ఫాలికిల్‌ చనిపోవటం వల్ల త్వరగా బట్టతల కలిగే అవకాశం ఉంది.
 
తలపై చర్మం బిగుతుగా ఉండటం వల్ల, ఫాలికిల్‌లకు రక్త ప్రసరణ తగ్గుతుంది. వీటి కన్నా, జుట్టు ఆరోగ్యాన్ని పెంచే హెయిర్‌ స్టయిల్స్‌ను పాటించటం చాలా మంచిది. అంతేకాదు.. కొన్ని రకాల హార్మోన్ మందులు, పిల్స్ వాడటం ద్వారా బట్టతస ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఇంకా బట్టతలను నివారించుకోవాలంటే.. వారానికి రెండుసార్లు ఉల్లిపాయ జ్యూస్‌ను మాడుకు పట్టించాలి. రోజు మార్చి రోజు మాడుకు ఆనియన్ జ్యూస్‌ను పట్టించడం ద్వారా జుట్టు పెరుగుతుంది. ఇంకా జుట్టు రాలే సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా మాడుకు అలోవెరా జెల్ పట్టించడం ద్వారా బట్టతల రాకుండా జాగ్రత్త పడవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బ‌రినీళ్లు, తేనె మిశ్ర‌మాన్ని పరగడుపున తీసుకుంటే?