Publish Date: Tue, 11 Mar 2025 (20:10 IST)
Updated Date: Tue, 11 Mar 2025 (20:12 IST)
తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఎర్ర జామకాయ జీర్ణక్రియను మెరుగుపరచడం, మంటను తగ్గించడం, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వాటిని కూడా తెలుసుకుందాము.
ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.
ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది.
తెల్ల జామకాయతో పోలిస్తే ఎర్ర జామకాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది.
సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే ఎర్ర జామకాయలు తింటుండాలి.
ఎర్ర జామ పండును మధుమేహం వున్నవారు కూడా తినవచ్చు.