Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పచ్చిమామిడి తింటే బరువు తగ్గుతారా? స్నాక్స్, కూరల్లో పచ్చి మామిడి ముక్కల్ని వేసుకుని?

పండిన మామిడితో బరువు తగ్గుతారా? పచ్చిమామిడితో బరువు తగ్గుతారా? ఈ ప్రశ్నకు సమాధానం లభించాలంటే ఈ స్టోరీ చదవండి. ఈ సీజన్లో మామిడి కాయలు సూపర్ మార్కెట్లలో లభ్యమవుతూనే ఉన్నాయి. కాబట్టి వారానికి రెండు మామిడ

పచ్చిమామిడి తింటే బరువు తగ్గుతారా? స్నాక్స్, కూరల్లో పచ్చి మామిడి ముక్కల్ని వేసుకుని?
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (14:16 IST)
పండిన మామిడితో బరువు తగ్గుతారా? పచ్చిమామిడితో బరువు తగ్గుతారా? ఈ ప్రశ్నకు సమాధానం లభించాలంటే ఈ స్టోరీ చదవండి. ఈ సీజన్లో మామిడి కాయలు సూపర్ మార్కెట్లలో లభ్యమవుతూనే ఉన్నాయి. కాబట్టి వారానికి రెండు మామిడి కాయలను కొని తినడం ఆరోగ్యానికి మంచే చేస్తుంది.

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు కూడా ఉపయోగపడే మామిడిని.. ఎలా తీసుకోవాలంటే.. పెరుగు, రైస్‌తో కలిపి తీసుకోవాలి. తద్వారా షుగర్ లెవల్స్ బాగా తగ్గిపోతాయి. అధిక చెమట పచ్చిమామిడి జ్యూస్ తాగడం వల్ల.. అధిక చెమటను నివారించవచ్చు.
 
రక్తపోటును తగ్గించే పొటాషియం పచ్చిమామిడిలో పుష్కలంగా ఉండాలి. అలాగే పచ్చిమామిడికాయలు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు నయమవుతాయి. రక్తపోటు తగ్గే అవకాశాలుంటాయి. ఇక అందరినీ వేధించే బరువు పెరిగే సమస్యను దూరం చేసుకోవాలంటే.. పచ్చిమామిడి తినడం వల్ల క్యాలరీలు కరగడానికి సహాయపడుతుంది. పండిన మామిడి కంటే.. పచ్చి మామిడి బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.
 
పచ్చిమామిడి కాయలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. తద్వారా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కూరల్లో, స్నాక్స్‌లో పచ్చిమామిడిని యాడ్ చేసుకుంటే.. పొట్ట సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఎసిడిటీ మీరు ఎసిడిటీతో బాధపడుతుంటే.. పచ్చి మామిడి చక్కటి పరిష్కారం. ఒక ముక్క పచ్చిమామిడిని నములుతూ ఉండటం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది. వర్షాకాలంలో ఏర్పడే వైరల్ ఇన్ఫెక్షన్లను మామిడి కాయ దూరం చేస్తుంది. 
 
పచ్చిమామిడి చేర్చుకోవడం వల్ల.. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటంతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల రిస్క్ తగ్గిస్తుంది. కాబట్టి మ్యాంగో చట్నీ, మ్యాంగో రైస్ తీసుకోవడం మంచిది. కాలేయ సంబంధిత సమస్యలను పచ్చిమామిడి నివారిస్తుంది. చర్మానికి పచ్చిమామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడతాయి. అలాగే ఏజింగ్ లక్షణాలను నివారిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిర్యానీ లాగించి సోడా తాగుతున్నారా? కాస్త ఆగండి గురూ...