బిర్యానీ లాగించి సోడా తాగుతున్నారా? కాస్త ఆగండి గురూ...
ఆధునిక పోకడలతో జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పు వచ్చేసింది. హై క్యాలరీ ఫుడ్స్, కూర్చునే గంటలపాటు పనిచయడంతో శారీరక శ్రమ లేకపోతుంది. ఇందుకు తోడు కృత్రిమ ఆహారాలపై అధిక దృష్టి పెట్టడం అనారోగ్య సమస్యలను కొన
ఆధునిక పోకడలతో జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పు వచ్చేసింది. హై క్యాలరీ ఫుడ్స్, కూర్చునే గంటలపాటు పనిచయడంతో శారీరక శ్రమ లేకపోతుంది. ఇందుకు తోడు కృత్రిమ ఆహారాలపై అధిక దృష్టి పెట్టడం అనారోగ్య సమస్యలను కొనితెచ్చి పెడుతోంది.
అలాంటి వాటిలో సోడా కూడా ఒకటి.. ఫుల్‌గా బిర్యానీలు లాగించి ఒక్క సోడా తాగిస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ సోడాతో ఎన్ని అనర్ధాలు జరుగుతాయో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. ఏ పార్టీకి వెళ్ళినా భోజనం చేస్తున్నా సోడా తాగడం చాలామందికి అలవాటైపోయింది.
కానీ సోడాలో సిట్రిక్ ఆసిడ్ ఉండటంతో దంతాలకు కీడు చేస్తుంది. అధిక మొత్తంలో చక్కెరలు వుండంతో దంతాలపై ఉండే ఎనామిల్‌ను పాడు చేస్తుంది. కార్బోనేటేడ్ సోడాను ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. సోడాను క్రమంగా తీసుకోవడం ద్వారా గుండెపోటు తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
సోడాతో బరువు పెరగడంతో ఊబకాయ సమస్య కూడా వేధించే అవకాశాలు చాలా ఉన్నాయని, మధుమేహం కూడా సోడా సేవించడం ద్వారానే వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సో.. సోడా వద్దే వద్దు.. ఫ్రెష్ జ్యూస్‌లే ముద్దుని తెలుసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.. మరి..