Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎండుద్రాక్షలతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్.. నోటి దుర్వాసనను పోగొట్టాలంటే?

ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేసే ఎండు ద్రాక్షలు.. బరువు తగ్గాలనుకునేవారికి ఎండుద్రాక్ష ఎంతో మేలుచేస్తుంది. వీటిల్లోన

Advertiesment
Dry Grapes
, శనివారం, 26 నవంబరు 2016 (15:15 IST)
ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేసే ఎండు ద్రాక్షలు.. బరువు తగ్గాలనుకునేవారికి ఎండుద్రాక్ష ఎంతో మేలుచేస్తుంది. వీటిల్లోని గ్లూకోజ్‌ శరీరానికి శక్తినిస్తుంది. రోగ నిరోధకశక్తినీ పెంచుతుంది. పైగా కొన్నే తిన్నా పొట్టనిండినట్లు అనిపిస్తుంది. కుదిరితే వ్యాయామం తరవాత వీటిని తీసుకోవచ్చు.
 
అలాగే రోజూ ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్, క్యాన్సర్ కారకాలు దూరమవుతాయి. ఎండుద్రాక్షలో ఉండే క్యాల్షియం, బోరాన్‌ పోషకాలు ఎముకలకు బలాన్నిస్తాయి. పిల్లల పెరుగుదలకు ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే నోటి దుర్వాసనా, చిగుళ్ల సమస్యలు బాధిస్తుంటే.. ఎండుద్రాక్షల్ని నోట్లో వేసుకుని ఎక్కువసేపు నములుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు అదుపులోకి వస్తాయి.
 
అలాగే రక్తహీనతకు చెక్ పెట్టాలంటే.. ఎండుద్రాక్షను తీసుకోవాలి. వీటిల్లోని ఇనుము, రాగి, విటమిన్‌ బి పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవన్నీ ఎర్రరక్తకణాల వృద్ధిని పెంచడం, రక్తప్రసరణలో లోపం లేకుండా చూస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మసాలా దినుసులు తీసుకుంటే మజ్జిగ తాగండి..