Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మసాలా దినుసులు తీసుకుంటే మజ్జిగ తాగండి..

మసాలా దినుసులు తింటున్నారా? అయితే తప్పకుండా మజ్జిగ తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్‌ ఆసిడ్‌ కడుపులోని గ్యాస్‌కు కల్లెం వేస్తుంది. ఆయుర్వేద ప్రకారం గ్యాస్‌కు మజ్జిగ మంచిది. మసాలా

Advertiesment
Is buttermilk good for acidity
, శనివారం, 26 నవంబరు 2016 (15:10 IST)
మసాలా దినుసులు తింటున్నారా? అయితే తప్పకుండా మజ్జిగ తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్‌ ఆసిడ్‌ కడుపులోని గ్యాస్‌కు కల్లెం వేస్తుంది. ఆయుర్వేద ప్రకారం గ్యాస్‌కు మజ్జిగ మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తిన్నప్పుడు మజ్జిగ తీసుకోవడం మరవొద్దు. మసాలా దినుసులు తీసుకున్నాక మజ్జిగను సేవించడం ద్వారా ఎసిడిటీని దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే గ్యాస్‌కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి లభించాలంటే కొబ్బరి నీళ్లు తాగాల్సిందే. అలాగే బెల్లం వల్ల గ్యాస్‌ ఎంతగానో తగ్గుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం కూడా లభిస్తుంది. ఇకపోతే.. ఒక కప్పు నీటిని మరిగించి.. అందులో ఒక టేబుల్‌స్పూన్‌ సోంపు వేసి కాసేపు అలాగే ఉంచండి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఆ నీటిలోకి ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే ఎసిడిటీకి పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
పచ్చటి తులసి ఆకుల్ని వేడి నీటిలో మరగనివ్వండి. కాసేపయ్యాక చల్లారిన తరువాత ఆ నీటిని సేవించండి. రోజూ ఇలా చేస్తే వారం పది రోజుల్లో గ్యాస్‌ కొంతవరకైనా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యాభర్తల మధ్య శృంగారం ఎలా ఉండాలంటే...?