Publish Date: Sat, 14 Oct 2023 (16:27 IST)
Updated Date: Sat, 14 Oct 2023 (16:29 IST)
ప్రకృతిలో లభించే వాటితో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోచ్చు. అలాంటి వాటిల్లో అరటిపువ్వు ఒకటి. ఇది పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఔషధంలా పని చేస్తుంది. అరటిపువ్వు తీసుకుంటే కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అరటి పువ్వులో ఉండే అధిక పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
మలబద్దక సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అరటి పువ్వు లోని పోషకాలు నాడీవ్యవస్థను సక్రమంగా పనిచేసేటట్లు దోహదపడుతాయి. అరటి పువ్వు ఆడవారిలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం అరికట్టడానికి ఇది పనికొస్తుంది. అరటి పువ్వుతో చేసిన పదార్థాలను తీసుకుంటుంటే కిడ్నీలో రాళ్లు తొలగుతాయి.
కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, రక్తం శుద్ధి అయ్యేందుకు రోజుకి వంద మిల్లీగ్రాముల అరటి పువ్వు రసాన్ని తాగుతుండాలి.
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.