తలనొప్పితో బాధపడతున్నారా? ద్రాక్షరసం తాగితే...

బుధవారం, 15 మే 2019 (17:30 IST)
సాధారణంగా మనలో చాలామంది తలనొప్పితో బాధపడుతుంటారు. పని చేయడం వల్ల బాగా అలసిపోయినా, డిప్రెషన్, మానసిక ఆందోళన, ఒత్తిడితో బాధపడుతున్నా లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా మనకు తలనొప్పి రెగ్యులర్‌గా వస్తూనే ఉంటుంది. అయితే తలనొప్పితో సతమతమవుతున్న వారు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే ఇంగ్లీషు మందులు మింగాల్సిన పని కూడా లేదు. సింపుల్‌గా ద్రాక్షరసం తాగితే దెబ్బకు తలనొప్పి తగ్గుతుంది.
 
బాగా తలనొప్పితో బాధపడేవారు ఒక గ్లాసు ద్రాక్షరసం తాగితే వెంటనే తలనొప్పి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ద్రాక్ష పండ్లలో ఉండే రైబోఫ్లేవిన్, విటమిన్ బి12, సి, కె, మెగ్నీషియంలు తలనొప్పిని తగ్గిస్తాయి. అదే విధంగా మైగ్రేన్ వంటి దీర్ఘకాలిక తలనొప్పి సమస్యకు కూడా ద్రాక్షరసం మెరుగ్గా పని చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ద్రాక్షరసాన్ని వారు రోజూ తాగడం వల్ల మైగ్రేన్ నుండి కూడా బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నోరూరించే మామిడిపండ్లు... కార్బైడ్‌తో పండించిన మామిడి పండ్లయితే....