సాధారణంగా మనం ఏదైనా అనారోగ్య సమస్యతో వెళితే వెంటనే వైద్యుడు నాలుక చూపించమని అడుగుతుంటాడు. నాలుక లోపల లైట్ వేసి తదేకంగా చూస్తుంటాడు. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలుక లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుందట.
నాలుక ఉదా రంగులో ఉంటే రక్తప్రసరణ సమస్యలు ఉన్నాయని అర్థమట. అలాగే కొలెస్ట్రాల్ స్థాయి కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా ఉంటుందని వైద్యులు గుర్తిస్తారట. అంతేకాకుండా పాలిపోయినట్లు అనిపిస్తే రక్తహీనత ఉన్నట్లేనని భావిస్తారట.
అప్పుడు పోషకాలు ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తారట. అలాగే ఎర్రరంగులో ఉంటే మాత్రం విటమిన్ బి లోపం ఉందని చెపుతారు. జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎరుపురంగులో మారుతుందట. యాంటీ బయాటిక్ మందులను ఎక్కువగా వాడితే నాలుక నల్లగా మారిపోతుందట. నోటీలో నాలుక మీద తరచూ పుండ్లు కూడా ఏర్పడుతుంటే శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థమట.
అలా ఉంటే ఖచ్చితంగా విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలట. ఎక్కువ రోజులు నాలుకకు సంబంధించి సమస్యలు ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. అలాగే బ్రష్ చేసిన తరువాత తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే బాక్టీరియా నోటిలో పెరిగి అనారోగ్య సమస్యకు కారణమవుతుందట.