చలికాలంలో వేడి అన్నం-కరివేపాకు కారం

చలికాలం వచ్చేస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని వారు చెప్తున్నారు. వేడి అన్నంలో నెయ్యి చేర్చి కరివేపాకు కారం, వెల్లుల్లి కారం, నల్ల

ఆదివారం, 26 నవంబరు 2017 (17:06 IST)
చలికాలం వచ్చేస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని వారు చెప్తున్నారు. వేడి అన్నంలో నెయ్యి చేర్చి కరివేపాకు కారం, వెల్లుల్లి కారం, నల్లకారం వంటివి కలిపి పిల్లలకు రెండు ముద్దలు తినిపిస్తే నోటికి, ఉదరానికి మేలు చేస్తాయి. ఆకలి పుడుతుంది. తద్వారా కడుపు ఉబ్బరం అజీర్తి సమస్యలు నయం అవుతాయి. పెద్దల్లోనూ కరివేపాకు కారం చలికాలంలో ఎంతో మేలు చేస్తుంది. గోధుమ, మొక్కజొన్న లాంటివాటితో జావలు కూడా పిల్లలకు శక్తినిస్తాయ. 
 
చలికాలంలో వేడి వేడి బజ్జీలు, పకోడీలు తీసుకోవడం కంటే.. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, మెంతులు, మిరియాల పొడులను ఆహారంలో చేర్చుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. జలుబు, దగ్గును దూరం చేస్తాయి. సీజనల్ పండ్లను తీసుకోవడం, ఎండిన పండ్లూ, బాదం పిస్తా అక్రోట్‌ వంటివి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సూప్‌లు తీసుకోవడం.. టీ తాగితే అందులో అల్లం ముక్కను చేర్చుకోవడం చేయడం ద్వారా చలికాలంలో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పుట్టగొడుగుల్ని ఉడికించినా అవి తగ్గవు...