పెరుగును రోజూ ఓ కప్పు తీసుకుంటే.. వయస్సు కనిపించదు..
పెరుగును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వయసు మీదపడినట్లు కనిపించరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు కనిపించకుండా వుండాలంటే.. కాలరీలు తక్కువగా ఉన్న ఫుడ్స్ తినాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవ
పెరుగును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వయసు మీదపడినట్లు కనిపించరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు కనిపించకుండా వుండాలంటే.. కాలరీలు తక్కువగా ఉన్న ఫుడ్స్ తినాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. పెరుగును రోజూ అరకప్పు లేదా ఒక కప్పు ఆహారంలో చేర్చుకోవడాన్ని మరిచిపోకూడదు.
ఎందుకంటే ఇందులో ఖనిజాలు, బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక నీరు బాగా తాగాలి. గ్రీన్ టీ తాగడం వల్ల జీవితకాలం పెరుగుతుంది. నిత్య యవ్వనులుగా కనిపిస్తారు. క్యాబేజీ, బ్రొకోలీ, మొలకలు తీసుకోవడం ద్వారా గుండెజబ్బులు తగ్గుతాయి. చురుకుదనం చేకూరుతుంది.
డ్రైఫ్రూట్స్, నట్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ సౌందర్యం మెరుగవుతుంది. పుచ్చకాయను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని.. యాంటీ ఏజింగ్ లక్షణాలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.