అనేక కూరగాయల లాగానే క్యాప్సికం కూడా మార్కెట్‌లో విరివిగానే లభిస్తోంది. బెంగుళూరు మిర్చిగా పిలవబడే ఈ కూరగాయ రకరకాల రంగుల్లో లభ్యమవుతోంది. కానీ రెగ్యులర్‌గా దొరికేవి పచ్చవి. ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఒక రోజుకు అవసరమయ్యే సి విటమిన్ ఒక క్యాప్సికం ద్వారా అందుతుందని చెబుతున్నారు ఆహార నిపుణులు.
క్యాప్సికంలో విటమిన్ సి, బి, ఇ, ఫోలిక్ యాసిడ్, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఎంజైమ్‌లు అరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. బీటా కెరోటిన్ పసుపు రంగు క్యాప్సికంలో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సిలు టమోటాలో కంటే క్యాప్సికంలోనే ఎక్కువగా ఉంటాయి.
కేలరీలు తక్కువగా ఉండే క్యాప్సికం జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి క్యాప్సికం దోహదపడుతుంది. క్యాప్సికం తినడం వలన సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. దీనిని తింటే జుట్టు రాలకుండా ఉంటుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మొటిమల నివారిణిగా కూడా క్యాప్సికం పనిచేస్తుంది. రోజువారీ ఆహారంలో భాగంగా క్యాప్సికంని చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.