పాల ఉత్పత్తి అయిన పెరుగు తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజా మార్గదర్శకం ప్రకారం, పెరుగు తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాము.
వెన్న లేని పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
పెరుగులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కనుక చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు.
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ డి కూడా ఉన్నాయి.
జీవక్రియను సరిచేయడంలో సహాయపడే ప్రోబయోటిక్స్‌ను పెరుగు కలిగి ఉంటుంది.
రాత్రిపూట పెరుగు తినవద్దు, ఇది శ్లేష్మాన్ని పెంచి సమస్యకు దారితీస్తుంది.
ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది.
పెరుగు తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం.