Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రెంచ్ ఫ్రైస్ తినవచ్చా లేదా? తింటే ఏమవుతుంది?

Advertiesment
French Fries
, శుక్రవారం, 29 జులై 2022 (23:22 IST)
ప్యాక్ చేసిన ఆహార పదార్థాల జోలికి దాదాపుగా వెళ్లకపోవడం మంచిదని చెపుతారు ఆహార నిపుణులు. ఎందుకంటే.. అవి నిల్వ వుంచేందుకు కొద్దిమోతాదులో పలు రసాయనాలు వాడుతారని చెపుతుంటారు. ఇలాంటివి నిరూపించి చూపించారు కూడా. ఐనా కొందరు మాత్రం ఇంట్లో చేసుకుని తినేందుకు వల్లకాక బజార్లో దొరికే చిరుతిండ్లపైనే మక్కువ చూపుతుంటారు. మొదట్లో ఇవి ఆరోగ్యానికి హాని చేసినట్లు అనిపించవు కానీ క్రమంగా చాప కింద నీరులో అనారోగ్య సమస్యలను తెస్తాయి. ఈ జాబితాలో చాలానే వున్నాయనుకోండి.

 
ఓ అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్... అంటే వేయించిన బంగాళాదుంపలను వారానికి రెండుసార్లు కంటే ఎక్కువసార్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్‌లోని సంతృప్త కొవ్వు.. అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచే గుణం వుంది. ఇవి తినడం వల్ల రక్త నాళాలైన ధమనుల నాళాలు గట్టిపడటం, శరీరంలోని ప్రతి ప్రాంతానికి రక్త చేరకుండా నిరోధించే గడ్డలను సృష్టింస్తుంది. ఫలితంగా హార్ట్ స్ట్రోక్స్, గుండెపోటుకు దారితీస్తుంది.

 
కొవ్వును కలిగి ఉన్న ఆహారాలను భారీ క్యాలరీ బాంబులుగా అభివర్ణిస్తుంటారు వైద్యులు. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన భోజన పదార్థాలకు దూరంగా వుండాలి. ఇవి చాలా డేంజర్. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పోలిస్తే, కొవ్వులు శరీరంలో వ్యతిరేక ఫలితాలను తెస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాల కంటే చాలా కాలం పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ తిష్ట వేసుకుని వుంటాయి. కనుక వేయించిన ఆహార పదార్థాలను తింటే ఉదరకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

 
ఫ్రెంచ్ ఫ్రైస్ రుచిగా వుండేందుకు అధిక మోతాదులో ఉప్పు జోడిస్తారు. రెస్టారెంట్లలో ఉపయోగించే ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది సోడియం సెన్సిటివ్‌గా ఉన్నవారిలో అధిక రక్తపోటుకు కారణమవుతుంది. గుండెను దెబ్బతీస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

World Hepatitis Day 2022: ఇంత చిన్న తప్పుకే కాలేయం పాడవుతుందా? ఏంటా తప్పులు?