Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రౌన్ రైస్ తీసుకుంటున్నారా? బాగా నమిలి తినాలట..

వైట్‌ రైస్‌తో పోల్చితే బ్రౌన్‌రైస్‌లో మాంగనీస్‌, పాస్ఫరస్‌ రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్‌ రోగులకు సాధారణ బియ్యంతో పోల్చితే బ్రౌన్‌రైస్‌తో చాలా మేలు జరుగుతుంది

Advertiesment
బ్రౌన్ రైస్ తీసుకుంటున్నారా? బాగా నమిలి తినాలట..
, ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (10:29 IST)
వైట్‌ రైస్‌తో పోల్చితే బ్రౌన్‌రైస్‌లో మాంగనీస్‌, పాస్ఫరస్‌ రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్‌ రోగులకు సాధారణ బియ్యంతో పోల్చితే బ్రౌన్‌రైస్‌తో చాలా మేలు జరుగుతుంది. వారంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు వైట్ రైస్ తీసుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కానీ బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆ ముప్పు వుండదు. 
 
బ్రౌన్ రైస్‌లోని ఇనోసిటల్‌ హెక్సాఫాస్పేట్‌ ఉంటుంది. ఇది కేన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఇది కేన్సర్‌ను నిరోధించడంలోనే కాకుండా చికిత్సలోనూ ఉపయోగపడుతుంది. అలాగే జీవక్రియల పనితీరు మెరుగుపడటానికి అవసరమయ్యే థయామిన్‌ బ్రౌన్‌రైస్‌లో పుష్కలంగా లభిస్తుంది. స్థూలకాయంతో బాధపడేవారు, బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్న వారు బ్రౌన్‌ రైస్‌ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఫోలసిన్‌ బ్రౌన్‌రైస్‌లో ఉంటుంది. శిశువుల్లో మెదడు ఎదుగుదల, వెన్నెముక ఎదుగుదల సరిగ్గా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. అందుకే గర్భిణిలు బ్రౌన్‌రైస్‌ తీసుకోవడం చాలా మంచిది. ఒక కప్పు బ్రౌన్‌రైస్‌లో రోజు తీసుకోవాల్సిన మెగ్నీషియం శాతంలో 21 శాతం లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మైగ్రేన్‌ సమస్యను అరికడుతుంది.
 
బ్రౌన్‌రైస్‌ను రోజులో ఒక సారి తీసుకున్నా సరిపోతుంది. అయితే నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశెకు బదులుగా అరకప్పు బ్రౌన్‌రైస్‌ను తీసుకోవచ్చు. లంచ్‌లో సాధారణ మీల్స్‌కు బదులుగా బ్రౌన్‌రైస్‌ పలావు తినవచ్చు. బ్రౌన్‌రైస్‌ను మష్రూమ్స్‌, వెజిటబుల్స్‌, చికెన్‌తో కలిపి తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రొయ్యల పకోడి భలే టేస్ట్... ఎలా చేయాలో తెలుసా?