ప్రతిరోజూ లేవగానే బ్లాక్ టీ తీసుకోండి.. గుండెపోటుకు చెక్ పెట్టండి..!
ప్రతిరోజూ లేవగానే బ్లాక్ టీ తీసుకుంటే గుండెపోటుకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు. రోజువారీగా మూడు కప్పుల బ్లాక్ టీ తాగితే 60 శాతం వరకు గుండెపోటును నియంత్రించవచ్చని అంటున్నారు. అలాగే మధుమేహానిక
ప్రతిరోజూ లేవగానే బ్లాక్ టీ తీసుకుంటే గుండెపోటుకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు. రోజువారీగా మూడు కప్పుల బ్లాక్ టీ తాగితే 60 శాతం వరకు గుండెపోటును నియంత్రించవచ్చని అంటున్నారు. అలాగే మధుమేహానికి కూడా బ్లాక్ టీ దివ్యౌషధంగా పనిచేస్తుందట. బ్లాక్ టీలోని యాంటియాక్సిడెంట్స్ రక్తపోటును నియంత్రిస్తుందని, తద్వారా గుండెపోటు రాకుండా చేస్తుందని వైద్యులు అంటున్నారు.
బ్లాక్ టీ వినియోగం వల్ల రెండు విధాలైన డయాబెటిస్‌కు చెక్ పెట్టడంతో పాటు కార్డియో సంబంధించిన వ్యాధులు కూడా దరిచేరవని అంటున్నారు. ప్రతి రోజూ ఐదు కప్‌ల బ్లాక్ టీని తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటీస్‌ను తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.