Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాదాల పగుళ్లకు దివ్యౌషధం.. కీరాజ్యూస్.. బియ్యం పిండి.. ప్యాక్ ఎలా...?

పాదాలు గరుకుగా, పగుళ్లతో అందవిహీనంగా ఉన్నాయా.. అయితే క్యారెట్ ప్యాక్ ట్రై చేయండి. క్యారెట్ తురుము పాదాలను మృదువుగా కోమలంగా చేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల

Advertiesment
Foot Care : Cucumber Hell/Buff Treatment
, శుక్రవారం, 5 ఆగస్టు 2016 (11:25 IST)
పాదాలు గరుకుగా, పగుళ్లతో అందవిహీనంగా ఉన్నాయా.. అయితే క్యారెట్ ప్యాక్ ట్రై చేయండి. క్యారెట్ తురుము పాదాలను మృదువుగా కోమలంగా చేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఇంకా అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి. టేబుల్‌స్పూన్‌ శనగపిండి పుల్లపెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి. కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాపిల్‌ని ఉడికించి తీసుకోకూడదు.. ఎందుకని..?