Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవి కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?

వేసవి కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?
, మంగళవారం, 17 మే 2016 (15:55 IST)
వేసవిలో వచ్చిందంటే చాలు కొంతమంది ఏది పడితే అది ఆరగిస్తుంటారు. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. 
 
అయితే నీటిని మాత్రమే తాగడంతో శరీరంలోని నీటి శాతాన్ని సరైన స్థాయిలో ఉంచుకోవడం కుదరదు. అందుచేత నీటిశాతం అధికంగా ఉన్న కూరగాయలను తీసుకోవడం చాలా మంచిది. వేసవిలో సూప్ వెరైటీలు, పండ్ల రసాలు, నీరు, మజ్జిగ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.
 
చాలా మంది బయట నుంచి ఇంటికి చేరుకున్నాక ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ వాటర్‌ను గటగటా తాగేస్తుంటారు. అలా తాగడం మంచిది కాదు. భోజనం చేశాక చాలా మంది మజ్జిగను తాగుతుంటారు. ఇలా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఉన్నట్టుండి పెరిగిపోతుంది. ఆహారం తీసుకునేముందు 10 నిమిషాలకు ముందు రెండు గ్లాసుల నీరు తాగడం మంచిది.
 
ఇక వేసవిలో శుభ్రమైన నీటిని సేవించాలి. ముఖ్యంగా కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను సేవించడాన్ని చాలా మటుకు తగ్గించాలి. కాకర, వంకాయ వంటివి వేసవిలో తీసుకోకపోవడం మంచిది ఎందుకంటే వేసవిలో ఇవి అంత త్వరగా జీర్ణంకావు. 
 
పుచ్చకాయలో 90 శాతం నీటి శాతం ఉండటంతో శరీరానికి తగిన నీటి శాతాన్ని పుచ్చకాయ అందిస్తుంది. ఇంకా కీరదోస ముక్కల్ని కూడా అధికంగా తీసుకోవచ్చు. వేసవిలో నీటిద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి ఎప్పడూ చేతిలో వాటర్ బాటిల్‌ను ఉంచుకోవడం మంచిది. 
Best and Worst, Summer, Foods

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొప్పాయి పండుతో ఉదర సంబంధిత వ్యాధులు మటమాయం!