రేగు పండ్లు. రోజువారీ ఆహారంలో రేగు పండ్లను చేర్చడం వల్ల మలబద్దకాన్ని నివారించవచ్చు. వీటిని తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
రక్తంలో చక్కెరను తగ్గించే గుణాన్ని కలిగి ఉన్నందున రేగు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది.
రేగు పండ్ల శోథ నిరోధక చర్య కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ నివారించడంలో సహాయపడుతుంది.
ఈ పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
రేగు పేస్టును చర్మంపై పూయడం వల్ల గాయం నయం కావడంతో పాటు చర్మం మృదువుగా ఉంటుంది.
రేగులో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వలన ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
ఆకలిని అలాగే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి రేగుపండు సహాయపడుతుంది.