పాల ఉత్పత్తి అయిన పెరుగు పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తుంది. పెరుగును అన్నంలో కలుపుకుని తినడమే కాకుండా కొన్నిసార్లు ఔషధంగా కూడా వాడుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాము.
జీలకర్రను కాస్త తీసుకుని పొడి చేసి దాన్నిఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు.
కొద్దిగా నల్ల ఉప్పును పొడి చేసి దాన్ని కప్పు పెరుగులో కలుపుకుని తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ మిశ్రమం ఎంతో మేలు చేస్తుంది.
పెరుగులో కాస్త చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్షణ శక్తి అంది మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గుతాయి.
కొద్దిగా వామును కప్పు పెరుగులో కలిపి తింటే నోటి పూత, దంత సంబంధ సమస్యలు పోతాయి.
పెరుగులో ఓట్స్ కలిపి తింటే ప్రోటీన్లు లభించి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.
పెరుగులో పండ్లను కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
పెరుగులో కాస్త పసుపు, కాస్త అల్లం కలిపి తింటే గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది.