వర్షాకాలమైతేనేం? చద్దన్నంలో కాస్త గంజి నీళ్లు కలుపుకుని తాగాల్సిందే...?
కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుని పనిచేయడం.. శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్య సమస్యలు అవంతట అవే వెతుక్కుంటూ వస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం.. వట్టి మెదడుకే పనెక్కువ ఇవ్వడం ద్వారా ఊబకాయం, రక్తపోటు
కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుని పనిచేయడం.. శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్య సమస్యలు అవంతట అవే వెతుక్కుంటూ వస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం.. వట్టి మెదడుకే పనెక్కువ ఇవ్వడం ద్వారా ఊబకాయం, రక్తపోటు, హృద్రోగాలు తప్పట్లేదు. వీటికి తోడు అలసట, నీరసం ఆవహిస్తుంది. ఈ రుగ్మతల నుంచి బయటపడాలంటే..? రోజంతా చురుగ్గా వుండాలంటే.. అల్పాహారంగా చద్దన్నం తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రాత్రి మిగిలిన అన్నంలో పెరుగో, లేదా వేడి గంజి, ఉప్పు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. రాత్రి మిగిలిన అన్నంలో ఉదయానికల్లా ఐరన్ చేరుతుంది. అలాగే పోటాషియం, కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఈ చద్దన్నాన్ని రోజు ఇడ్లీ, దోసెలకు బదులు తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వర్షాకాలంలో గంజి లేదా వేడినీళ్లను కలిపి రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున తింటే.. చర్మ వ్యాధులను తొలగించుకోవచ్చు. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం చద్దన్నం తగ్గిస్తుంది. ఇంకా నీరసం తగ్గిపోతుంది. బీపీ అదుపులో ఉంచే గుణం చద్దన్నానికి వుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.