Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈసీజీ రిపోర్ట్ వుంటే చాలు.. ఏఐ ద్వారా ఏడాదిలోపే మృత్యువును కనిపెట్టేయవచ్చు..

ఈసీజీ రిపోర్ట్ వుంటే చాలు.. ఏఐ ద్వారా ఏడాదిలోపే మృత్యువును కనిపెట్టేయవచ్చు..
, గురువారం, 14 నవంబరు 2019 (10:10 IST)
ఈసీజీ ప్రామాణిక పరీక్షలను చేపట్టిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా  ఒక సంవత్సరంలోపు ఏదైనా వైద్య కారణాలతో మరణించే రోగులను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ నిర్ణయానికి రావడానికి, పెన్సిల్వేనియాలోని గీసింజర్ హెల్త్ సిస్టమ్ పరిశోధకులు దాదాపు 400,000 మంది రోగుల నుండి 1.77 మిలియన్ ఈసీజీలను ఇతర రికార్డుల ఫలితాలను విశ్లేషించారు.
 
ఈసీజీ సంకేతాలను ప్రత్యక్షం విశ్లేషించిన పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైద్య కారణాలతో మృతి చెందే రోగులను సంవత్సరానికి ముందే పసిగట్టవచ్చునని చెప్పారు. ఈసీజీ సంకేతాలను ప్రత్యక్షంగా విశ్లేషించిన న్యూరల్ నెట్‌వర్క్ మోడల్ మరణానికి ఒక సంవత్సరం ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఉన్నతమైనదిగా కనుగొనబడింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈసీజీ కలిగి వున్నట్లు వైద్యుడు భావించిన రోగులలో కూడా న్యూరల్ నెట్‌వర్క్ మరణ ప్రమాదాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగింది.
 
ముగ్గురు కార్డియాలజిస్టులు మొదట మామూలుగా చదివిన ఈసీజీలను విడివిడిగా సమీక్షించారు. వారు సాధారణంగా న్యూరల్ నెట్‌వర్క్ గుర్తించిన ప్రమాద నమూనాలను గుర్తించలేకపోయారని పరిశోధకులు తెలిపారు.
 
ప్రస్తుత ఆరోగ్య సమస్యలను గుర్తించడం కంటే ఈసీజీ నమూనాల ద్వారా మృత్యువును అంచనా వేయగలమని చెప్పారు. రోగుల ఈసీజీలను కంప్యూటర్ ద్వారా కనిపెట్టగలమని ప్రొఫెసర్ ఫోర్న్నాల్ట్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాటి వాడకం తగ్గడంతో ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుందట..!