బరువు తగ్గాలంటే.. రోజూ కప్పు క్యాబేజీ తురుము తినండి..
బరువు తగ్గాలంటే.. రోజూ కప్పు క్యాబేజీ తురుము తినండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. క్యాబేజీ శుభ్రంగా నీటిలో కడిగేసి.. తురుముకుని ఒక కప్పు రోజూ పరగడుపున తీసుకుంటే.. అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్య
బరువు తగ్గాలంటే.. రోజూ కప్పు క్యాబేజీ తురుము తినండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. క్యాబేజీ శుభ్రంగా నీటిలో కడిగేసి.. తురుముకుని ఒక కప్పు రోజూ పరగడుపున తీసుకుంటే.. అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెప్తున్నారు. అలాగే క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది.
పొగతాగే వారు క్యాబేజీని తింటే ఆ అలావాటు ద్వారా శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవచ్చు. నొప్పులను నివారించే గుణాలు, శరీర అందాన్ని పెంచే ఔషధ గుణాలు క్యాబేజీలో వున్నాయి. వాపులున్న చోట రాత్రి పడుకునే ముందు క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి.
శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటికి పంపించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది.ఇందులోని పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. క్యాబేజీ క్యాన్సర్‌ను నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.