Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిస్తేజం.. అలసట ఆవరించినట్టుగా ఉందా.. ఇలా చేయండి...

నిస్తేజం.. అలసట ఆవరించినట్టుగా ఉందా.. ఇలా చేయండి...
, ఆదివారం, 18 నవంబరు 2018 (14:24 IST)
చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. మూడు పూటల పుష్కలంగా ఆహారం ఆరగిస్తుంటారు. కానీ, అలసట, నిస్తేజం ఆవరించినట్టుగా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో వారికి అర్థంకాదు. ఇదే అంశంపై వైద్యులను సంప్రదిస్తే, 
 
* ప్రతిరోజూ ఉదయం పూట అల్పాహారం మానేస్తే, నిద్ర మత్తు నుంచి మేల్కొలిపే కాఫీలాంటి ఉత్ర్పేరకాల మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కెర స్థాయిలను సమంగా ఉంచుకునేలా ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తినాలి. 
 
* రాత్రి నిద్రకు ముందు మొబైల్‌, టీవీ, వీడియో గేమ్స్‌ వంటి ఉపకరణాల వాడకం వల్ల మెదడు చైతన్యవంతంగా ఉండి నిద్ర రానివ్వదు. ఫలితంగా పగటి వేళంతా నీరసంగా ఉంటాం. కాబట్టి ఈ ఉపకరణాలను పడగ్గదిలోకి అనుమతించకూడదు. 
 
* ఎక్కువ నిద్రపోతే శరీరానికి ఎక్కువ విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటే పొరపాటు. 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది. అంతకంటే ఎక్కువ సమయంపాటు నిద్రపోతే అలసట దరి చేరుతుంది. 
 
* వ్యాయామం చేస్తే శరీరం ఉత్తేజితమవుతుంది. కానీ నీరసంగా ఉన్నప్పుడు వ్యాయామం ఎలా చేయడం? అనుకోకూడదు. వ్యాయామంతో శరీరంలో ఫీల్‌ గుడ్‌ హోర్మోన్లు విడుదలై కొత్త ఉత్తేజాన్ని అందిస్తాయి. 
 
8స్వల్ప డీహైడ్రేషన్‌ వల్ల శక్తి తగ్గుతుంది. కాబట్టి రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. అన్ని నీళ్లు తాగలేకపోతే నీళ్లతోపాటు పళ్ల రసాలను ఎంచుకోవచ్చు
 
* స్వల్ప డీహైడ్రేషన్‌ వల్ల శక్తి తగ్గుతుంది. కాబట్టి రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. అన్ని నీళ్లు తాగలేకపోతే నీళ్లతోపాటు పళ్ల రసాలను ఎంచుకోవచ్చు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒత్తిడి, లో బీపీల నివారణకు వాల్‌నట్స్‌‌తో నివారణ