Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యాభర్తలు ఏ రోజుల్లో కలిస్తే గర్భధారణ జరుగుతుంది?

భార్యాభర్తలు ఏ రోజుల్లో కలిస్తే గర్భధారణ జరుగుతుంది?
, బుధవారం, 25 ఆగస్టు 2021 (18:31 IST)
ఈమధ్య కాలంలో చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అధికబరువు సమస్యతో పాటు గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని టైంకి చేయాల్సిన పనులు చేయడంలేదు. ఫలితంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.
 
సాధారణంగా పాతికేళ్ల వయసులో గర్భం ధరిస్తే తల్లికీ, బిడ్డకీ మంచిది. అంతకంటే వయస్సు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల నుంచి బిడ్డకు అందే క్రోమోజోముల విషయంలో కొన్ని రకాల సమస్యలు తలెత్తే ప్రమాముందంటున్నారు గైనకాలజిస్ట్‌లు.
 
వయస్సు పెరుగుతున్న కొద్దీ అండాశయాల పనితీరు తగ్గుతుంది. అండాలు సరిగ్గా విడుదల కావు. విడుదలైనా ఫలదీకరణం విషయంలో సరిగా స్పందించవు. అంతేకాకుండా హార్మోన్ల పనితీరూ మందకొడిగా ఉంటుంది. కంటి వలయానికి వచ్చే ఇన్ ఫెక్షన్లూ క్రమంగా పెరుగుతాయి.
 
వయస్సు ముప్ఫై ఐదేళ్ళు వచ్చాయంటే, హైబీపీ, మధుమేహం వంటి సమస్యలు మొదలవుతాయి. దాంతో కాన్పు కష్టమవుతుంది. కొన్ని సార్లు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డల్లాంటివి ఏర్పడతాయి. దీనివల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు తగ్గి, సిజేరియన్ చేయాల్సి వస్తుంది.
 
నలభై ఏళ్ల వయసులో గర్భం దాలిస్తే కొన్నిసార్లు క్యాన్సర్లు రావటానికి ఆస్కారం ఉంది. శిశువు ఎదుగుదల సరిగా ఉండదు. కొన్నిసార్లు శారీరక, మానసిక సమస్యలతో పుడతారు. అందుకే లేటు వయసులో గర్భం ధరించాలనుకొనే చాలామంది కృత్రిమ పద్ధతులని ఎంచుకొంటారు.
 
పాటించాల్సిన జాగ్రత్తలు :
లేటు వయసు గర్భధారణలో జన్యు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఆ సమస్యల్ని అడ్డుకట్ట వేసేందుకు ఫోలిక్ యాసిడ్‌ని అందించే మాత్రలని ముందు నుంచీ తీసుకోవడం మొదలుపెట్టాలి.
 
 చాలామంది మహిళల్ని రక్తహీనత సమస్య వేధిస్తూ ఉంటుంది. అటువంటి వారు ముందుగానే పరీక్షలు చేయించుకొని ఇనుము అందించే పోషకాలని తినాలి. తృణధాన్యాలూ, ఆకుకూరలు, కమలాఫలాలు, పండ్ల రసాలూ, వేరుశెనగపప్పు వంటివన్నీ ఆహారంలో చేర్చుకోవాలి. గర్భం ధరించాలన్న ఆలోచన వచ్చిన ఆర్నెల్లు లేదా ఏడాది ముందు నుంచీ ఈ ఆహారం తీసుకోవడం ప్రారంభించాలి.
 
గైనకాలజిస్ట్‌ను కలిసి ఫైబ్రాయిడ్స్, ఎండో మెట్రియోసిస్, ఇతర ఆరోగ్య సమస్యలు లేవనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఇకపోతే రుతుక్రమం వచ్చిన తర్వాత 10 నుంచి 20 రోజుల్లోపు భార్యాభర్తలు కలిస్తే గర్భ ధారణకు అనుకూలం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమలపాకు ఓకే.. కిళ్లీలు ఎక్కువగా తిన్నారో.. కిడ్నీలో రాళ్లు తప్పవా?