ఫిట్‌నెస్‌పై అవగాహన ఉన్న వ్యక్తులు కొలెస్ట్రాల్, బరువు పెరుగుట సమస్యలను నివారించడానికి వారి ఆహారంలో నెయ్యి పూర్తిగా మానేసిన రోజులు పోయాయి. నెయ్యి అనేది సూపర్‌ఫుడ్. ఆయుర్వేదం శతాబ్దాలుగా నెయ్యిని ఔషధంగా ఉపయోగిస్తోంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. నెయ్యితో రోజును ప్రారంభించడం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం, నెయ్యి చిన్న ప్రేగుల యొక్క శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి లేదా నిద్రలేమిని నెయ్యి దూరం చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్యం. అల్జీమర్స్ వ్యాధిని కూడా నివారిస్తుంది. నెయ్యి నిజానికి బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుంది.
* నెయ్యి జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది ఇది ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
* నెయ్యి చర్మం ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండటం వల్ల చర్మానికి వన్నె తెస్తుంది.
* ఆకలిని నియంత్రిస్తుంది ఎముకలకు శక్తిని పెంచుతుంది.