కొన్ని ఆహార పదార్థాలు ఖచ్చితంగా మెదడు ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. చక్కెర, శుద్ధి చేసిన పిండి పదార్థాలు, అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా ఉండే ఇన్‌ఫ్లమేటరీ డైట్ ప్యాటర్న్‌లు బలహీనమైన జ్ఞాపకశక్తిని కలుగజేస్తాయి. మెదడుని ఇబ్బందిపెట్టే పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. చక్కెర అధికంగా వుండే శీతల పానీయాలు టైప్ 2 డయాబెటిస్ సమస్యతో పాటు బ్రెయిన్ పైన ప్రతికూలమైన ఫలితాలనిస్తాయి.
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లలో చక్కెరలు, మైదాపిండి వంటి అధిక ప్రాసెస్ చేయబడినవి మెదడు ఆరోగ్యానికి మంచిది కాదు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారం కూడా మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చిప్స్, స్వీట్లు, ఇన్‌స్టెంట్ నూడుల్స్, మైక్రోవేవ్ పాప్‌కార్న్, స్టోర్‌లో వుంచిన సాస్‌లు, రెడీమేడ్ భోజనం వంటివి మంచివి కాదు.
అనేక చక్కెర రహిత ఉత్పత్తులలో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్లు మెదడు పనితీరుకు హాని కలిగిస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని సమస్యల్లోకి నెట్టే మరొకటి మద్యం. మద్యాన్ని మితిమీరి తాగితే మెదడు పనితీరు సరిగా వుండదు.