Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువు తగ్గాలా? ఐతే 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయండి..

బరువు తగ్గాలనుకుంటున్నారా? వాకింగ్, జాగింగ్‌లను పక్కనబెట్టి.. పది నుంచి 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ మనస్సును హ్యాపీగా ఉంచుకోండి. ఇంట్లోనే ఉం

బరువు తగ్గాలా? ఐతే 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయండి..
, మంగళవారం, 3 జనవరి 2017 (12:06 IST)
బరువు తగ్గాలనుకుంటున్నారా? వాకింగ్, జాగింగ్‌లను పక్కనబెట్టి.. పది నుంచి 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ మనస్సును హ్యాపీగా ఉంచుకోండి. ఇంట్లోనే ఉండాలనుకుంటే యూట్యూబ్‌లోనో, టీవీ ఛానల్స్‌లోనో వస్తున్న యోగా చూస్తూ ప్రాక్టీస్‌ చేయండి. ఎన్నిసార్లు తిన్నా తినేటప్పుడు మాత్రం కంట్రోల్‌లో ఉండండి. తక్కువ మొత్తాన్ని ఎక్కువసార్లు తీసుకోండి. 
 
చక్కెర, ఉప్పువాడకం కొంత తగ్గించండి. తాజా పండ్లు తీసుకోండి. వాటిలో సహజమైన చక్కెరలుంటాయి. ఏదైనా ఇష్టమైన ఫుడ్‌ అయినప్పటికీ మితంగా తినండి. ఆకలి వేసినప్పుడు జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోండి. ఆకలి తీరుతుంది. ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకున్నట్టుగా ఉంటుంది. వేడినీళ్లు తాగడం వల్ల ఒంటిలో నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. 
 
అందుకే ఉదయాన్నే గ్లాసెడు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనే, కొంచెం నిమ్మరసం కలిపి తాగండి. తొందరగా బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒంట్లో ఉన్న టాక్సిన్స్‌ అన్నీ బయటికి వెళ్లాలంటే రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. అలాగే ఇంటి పని చేయండి. ఇంట్లోని పనిచేస్తూ సాధ్యమైనన్నీ సార్లు కింద కూర్చుని లేస్తూ ఉంటేనే బరువు సులభంగా తగ్గిపోతారని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలకు పోషకాహారం తప్పనిసరి.. పాలతో పాటు ఇవి కూడా ఇవ్వండి..