పిల్లలకు పోషకాహారం తప్పనిసరి.. పాలతో పాటు ఇవి కూడా ఇవ్వండి..
పిల్లల పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం. అందుకే రోజులో మూడు సార్లు పిల్లలకు పాలు తగిన మోతాదులో ఇస్తుండాలి. పాలతో పాటు క్యాల్షియం పొందేందుకు.. వేయించిన నువ్వులు, మొలకెత్తిన సోయా గింజలు ఇస్తే పిల్లల ఎదు
పిల్లల పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం. అందుకే రోజులో మూడు సార్లు పిల్లలకు పాలు తగిన మోతాదులో ఇస్తుండాలి. పాలతో పాటు క్యాల్షియం పొందేందుకు.. వేయించిన నువ్వులు, మొలకెత్తిన సోయా గింజలు ఇస్తే పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
సగం కప్పు మొలకెత్తిన సోయా గింజల్లో 230 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది. అది ఎముకల పటిష్టానికి తోడ్పడుతుంది. అలాగే సాల్మాన్ చేపలోనూ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. మాంసాహారం తినని వాళ్లు కూడా ఇష్టపడే ఫుడ్ చేపలు. అందులోని సాల్మన్ చేపలు ఇంకా శ్రేష్టమైనవి. ఈ సాల్మన్ ఫిష్‌లో 212మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
సోయాపాలతో చేసిన పెరుగులాంటి పదార్థం ఇది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. సగం కప్పు టోఫులో 253 గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇక బాదం గింజల్లో క్యాల్షియంపాళ్లు తక్కువే. పిడికెడు బాదం గింజలనుంచి 72 మి.గ్రాముల క్యాల్షియం లభిస్తుందని న్యూట్రీషన్లు చెప్తున్నారు.